మత్య్సకారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..రేపు ఖాతాల్లోకి డబ్బులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-25 15:02:43  IST  )

మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేట నిషేదం సమయంలో జాలర్లకు అందించే సాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

మత్య్సకారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..రేపు ఖాతాల్లోకి డబ్బులు
X

దిశ, వెబ్ డెస్క్: మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేట నిషేదం సమయంలో జాలర్లకు అందించే సాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మత్య్సకార సేవలో పేరుతో జాలర్లకు రూ.20వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ.258 కోట్ల మేర లబ్ది జరుగుతుందని ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తామని ప్రకటించారు.

నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. భేటీ తరవాత మంత్రి నిమ్మలనాయుడు మీడియాతో మాట్లాడారు. చేపలవేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20వేలు ఇస్తామని చెప్పారు. గతంలో రూ.10వేలుగా మారుస్తామని మత్య్సకారులకు హామీ ఇచ్చామని ఆ విధంగా ఇప్పటినుండి అమలు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మత్య్సకారులకు ఎంతో మేలు జరగనుంది. సాధారణంగా వేట నిషేధం సమయంలో జాలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటి నుండి ఆ సమస్య తీరే అవకాశం ఉంది.

Next Story