AP Govt.: కూటమి సర్కార్‌కు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |

కూటమి సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో శుభవార్త చెప్పింది.

AP Govt.: కూటమి సర్కార్‌కు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్‌ (Battery Storage Power Plant) ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కడప (Kadapa) జిల్లా మైలవరం (Mailavaram) కేంద్రంగా సుమారు రూ.5,200 కోట్ల వ్యయంతో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు ప్రాంతాల్లో వెయ్యి మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాల కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో కుప్పం‌ (Kuppam)లో 100 మెగావాట్లు, గోదావరి (Godavari)లో 100 మెగావాట్లు, కర్నూలు (Kurnool) జిల్లా గని వద్ద 400 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్ణయాలు, నిధుల విషయంలో కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే రూ.30,436 కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) కొత్త డీబీఆర్‌ (DBR)ను కేంద్రం ఆమోదించింది. ఫలితంగా గతంలో ఇచ్చిన నిధులు పోను రూ.12,157 కోట్ల నిధులు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు చిక్కింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్లు అడ్వాన్స్‌గా మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.7 వేల కోట్ల వరకు అవసరమని పోలవరం అధికారులు చెబుతున్నారు. కాగా, 2014, అక్టోబర్ 8న పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రాజెక్ట్ పాత బకాయిల రీయింబర్స్‌మెంట్‌ (Reimbursement) కింద రూ.800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా మరో రూ.2 వేల కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story