- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Govt.: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. DA జీవోలో స్వల్ప మార్పులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి బహుమతిగా ఒక డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి బహుమతిగా ఒక డీఏ విడుదలకు కూటమి సర్కార్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఏను 3.64 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగుల డీఏ జీవోలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రిటైర్‌మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న జీవో విడుదల కాగా.. ఆ జీవోలో స్వల్ప మార్పులు చేస్తూ మళ్లీ కొత్త జీవో విడుదలైంది. డీఏ బకాయిల్లో 10 శాతం 2026 ఏప్రిల్‌లో చెల్లించాలని.. మిగిలిన 90 శాతం మూడు విడతల్లో చెల్లించాలని తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. కాగా, రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67 ఉండగా.. అది 37.31 శాతానికి పెరగనుంది.
Next Story






