- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల కొండకు చేరుకొని.. భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ తరుణంలో వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) ఉదయం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఘన స్వాగతం పలికారు. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆయనకు చిత్రపటాన్ని అందజేశారు.






