- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cyclone Montha Effect: రాష్ట్రంలో రూ.5,265 కోట్ల ఆస్తి, పంటనష్టం
రాష్ట్రంలో మొంథా తుపాన్(Cyclone Montha) కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మొంథా తుపాన్(Cyclone Montha) కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)కు ప్రాథమిక నివేదికను అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం మొంథా తుపాన్ కారణంగా రూ.5,265 కోట్ల నష్టం కలిగిందని స్పష్టం చేశారు. మొంథా తుపాన్ అందరితో దాగుడుమూతలు ఆడిందని తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుపాన్ నష్టాన్ని తగ్గించామని చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. బాధితులు అందరినీ ఆదుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
= వ్యవసాయం రంగంలో రూ.829 కోట్ల నష్టం
= హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం
= సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం
= పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం (20 పశువులు)
= ఆక్వా రంగంలో రూ.1270 కోట్ల నష్టం
= మున్సిపల్ శాఖలో రూ.109 కోట్ల నష్టం
= హౌసింగ్ శాఖలో రూ.5.53 కోట్ల నష్టం
= రోడ్లు భవనాల శాఖకు రూ.2079 కోట్ల నష్టం
= జలవనరుల శాఖకు రూ.207 కోట్ల నష్టం
= గ్రామీణ రక్షిత నీటిశాఖకు రూ.కోటి 26 లక్షల నష్టం
= పంచాయతీరాజ్ శాఖకు రూ.8 కోట్ల నష్టం
= విద్యుత్ శాఖకు రూ.16 కోట్ల నష్టం






