- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. APADCLకు రూ.75 కోట్ల నిధులు మంజూరు
రాష్ట్రంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హడ్కో (HUDCO) రుణం తీర్చేందుకు ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Andhra Pradesh Airports Development Corporation Ltd - APADCL)కు రూ.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. విజయానంద్ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హడ్కో నిధులతో భోగపురం, కుప్పం, దగడార్తి (ఒర్వకల్లు), శ్రీకాకుళం (కంచిలి), అమరావతి (నిడమర్రు) తదితర ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. 2025లో జరిగిన కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం హడ్కో రుణాలకు గ్యారంటీ ఇచ్చి, నేరుగా నిధులు కేటాయించింది.
Next Story






