- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం (Machilipatnam) సమీపంలో నిర్మిస్తున్న మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు (Greenfield Port) నిర్మాణ గడువును మరో 434 రోజులు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ ఏడాది అక్టోబర్ 21లోగా పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ గడువును కాస్త 2026 డిసెంబర్ 28 వరకు పొడిగించారు. ఇటీవలే పోర్టు నిర్మాణ బాధ్యత వహిస్తున్న ‘కన్సార్టియం’ (Consortium) సంస్థ గడువు పొడిగింపు కోరుతూ సాంకేతిక కారణాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ సిఫార్సు చేసిన అనంతరం, ప్రభుత్వం అధికారికంగా గడువు పొడిగింపుకు అనుమతి ఇచ్చింది.
కాగా, గతంలోనూ ఈ పోర్టు నిర్మాణానికి బహుళసార్లు గడువు పొడిగింపులు జరిగిన నేపథ్యంలో తాజా పొడిగింపుపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులతో నిర్మితమవుతున్న ఈ పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు వాణిజ్య రంగంలో కీలక మార్పులు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పోర్టు పనులు వేగవంతం కావాలని, గడువు పొడిగింపులు ఇక కల్పించొద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.






