- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో 3 మున్సిపాలిటీల గ్రేడ్ పెంపు.. ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ లో మూడు మున్సిపాలిటీల గ్రేడ్ ను పెంచుతూ రాష్ట్ర ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మూడు మున్సిపాలిటీల గ్రేడ్ ను పెంచుతూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ హోదా పెంచుతున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకూ స్పెషల్ గ్రేడ్ లో ఉన్న కదిరి మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని హోదా పెంచారు.
అలాగే గ్రేడ్ 1లో ఉన్న వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్ కు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కు పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. 2021 నుంచి ఈ మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని హోదా పెంపు నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీల గ్రేడ్ల పెంపు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.






