RTC: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు

by Ramesh Naini |

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది.

RTC: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ప్రభుత్వం చేర్చింది. అందులో ఎన్ఎంయూఏ, ఎంప్లాయిస్ యూనియన్లను కౌన్సిల్‌లో చేర్చారు. ఈ రెండు ప్రధాన సంఘాలకు ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం సభ్యత్వం మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, హక్కులు నేరుగా ప్రభుత్వంతో చర్చించే అవకాశం లభిస్తుంది.

Next Story