- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు బోట్ల అక్రమ వేట.. ఏపీ ప్రభుత్వం సీరియస్
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర తీరంలోకి తమిళనాడు మత్య్సకారులు బోట్ల ద్వారా చేప వేట సాగిస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర తీరంలోకి తమిళనాడు మత్య్సకారులు బోట్ల ద్వారా చేప వేట సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కృష్ణపట్నం పోర్టు సమీపంలో తమిళనాడు బోటు(Tamilnadu Boat)ను మెరైన్ పోలీసులు(Merain Police) పట్టుకున్నారు. అనంతరం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్(Juvvaladinne Fishing Harbour)కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఆరుగురు మత్య్సకారులను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ప్రభుత్వ నిఘా వైఫల్యం వల్లే తమిళనాడు బోట్లు రాష్ట్ర సరిహద్దులు దాటి వస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. తమిళనాడు బోట్ల అక్రమ వేటపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర మత్య్సకారులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. స్పీడ్ బోట్ల ద్వారా సముద్రంలో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోందని, ఈ సమయంలో ఫిషింగ్ హార్బర్‌పై ప్రతిపక్షం ఆరోపణలు అర్ధరహితమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జువ్వెలదిన్నె హార్బర్ దగ్గర సాగర్ డిఫెన్స్‌కు 7.5 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. పులికాట్‌లో పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.






