- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రైనీ కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ట్రైనీ కానిస్టేబుళ్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ట్రైనింగ్ లో ఇచ్చే స్టైఫండ్ ను

దిశ, వెబ్‌డెస్క్: ట్రైనీ కానిస్టేబుళ్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ట్రైనింగ్ లో ఇచ్చే స్టైఫండ్ ను భారీగా పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఇప్పటి వరకూ రూ.4500గా ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్ ను రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందదని, ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతను పోలీసులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. కాగా.. 6100 పోస్టులకు నోటిఫికేష్ ఇవ్వగా 6014 మంది ఎంపికయ్యారని, వారిలో 5757 మంది శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. 3343 మంది సివిల్, 2414 మంది ఏపీఎస్పీ కానిస్టేబు్లు ఉన్నట్లు వెల్లడించారు.






