- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో స్త్రీ శక్తి పథకానికి రూ.800 కోట్లు విడుదల
రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న..

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న పథకం స్త్రీ శక్తి. ఈ పథకం ద్వారా అనేకమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. పథకం అమలులో ఎక్కడా నిధుల కొరత లేకుండా, రాకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్త్రీ శక్తి పథకానికి ఇప్పటికే కేటాయించిన నిధులు కాకుండా .. అదనంగా రూ.800 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ నుంచి 2026 మార్చి వరకూ స్త్రీ శక్తి అమలు కోసం నెలకు రూ.160 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ ఆదేశాల్లో తెలిపింది.
కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోబర్ వరకూ రూ.400 కోట్లను విడుదల చేసింది. నిధుల విడుదలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్ఎంయూఏ, ఎప్లాయిస్ యూనియన్, కార్మిక పరిషత్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.






