ప్రభుత్వం కీలక నిర్ణయం.. 11 కార్పొరేషన్లకు చైర్మన్ల నియమాకం

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

ప్రభుత్వం కీలక నిర్ణయం.. 11 కార్పొరేషన్లకు చైర్మన్ల నియమాకం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. 11 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్(CS Vijayanand) ఉత్తర్వుల జారీ చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కల్యాణం శివశ్రీనివాసరావుతో పాటు ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డు ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ చైర్మన్ గా సత్యనారాయణ రాజును నియమించింది.

ఉర్దూ అకాడమీకి మౌలానా షిబిలీ, ఏపీ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్‌కు విక్రమ్, పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి రామ్ ప్రసాద్, పెరిక వెల్పేర్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీకి వీరభద్రరావు, భట్రాజ వెల్ఫూర్ అండ్ డెవలప్ మెంట్‌కు వెంకటేశ్వరరాజు, స్టేట్ షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీకి ముక్తియార్, కుర్ని, కరికాల భక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీకి మిన్నప్ప, స్టేట్ రెడ్డిక వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీకి శంకర్ రెడ్డి, పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి మధుబాబును నియమించారు. ఈ మేరకు వీరంతా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

Next Story