రైతులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల వ్యవసాయ కనెక్షన్లు

by Vemula.Srinu Prasad |

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..

రైతులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల వ్యవసాయ కనెక్షన్లు
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు ఏపీ ప్రభుత్వం(Ap Government) గుడ్ న్యూస్ తెలిపింది. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్(Free Current) ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా మరో 25 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. లో ఓల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొంత కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు.

Next Story