- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో జనగణన (AP Census) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జనగణన (AP Census) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఈ ఏడాది జూన్ 16వ తేదీన కేంద్రహోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027, మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది.
ఇక ఈసారి నిర్వహించే జనగణన కోసం కేంద్రం డిజిటల్ (Digital Census) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనుంది. ఇళ్ల స్థితిగతులు, సౌకర్యాలు, ఆస్తుల వివరాలను అందులో నమోదు చేయనున్నారు.
Next Story






