చేనేతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-15 03:51:19  IST  )

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.

చేనేతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ పథకం ద్వారా చేనేతలు, పవర్ లూమ్స్‌కు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. వచ్చే ఏప్రిల్ 1st నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఇప్పటికే అర్హుల ఎంపిక సైతం పూర్తి కాగా, ఏప్రిల్ 1st నుంచి నిబంధనల ప్రకారం ఉచిత విద్యుత్ కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా హ్యాండ్‌లూమ్స్ కార్మికులకు నెలకు రూ.700 వరకు, పవర్ లూమ్స్ కార్మికులకు రూ.1800 వరకు విద్యుత్ ఖర్చులు ఆదా కానున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. మరోవైపు.. చేనేతలకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి ఇటీవల కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ పథకం ద్వారా దాదాపు 4 లక్షల మంది లబ్ధిపొందనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల వరకు మర మగ్గాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Next Story