- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్‌న్యూస్.. మత్స్యకార కుటుంబాలకు ఏపీ సర్కార్ ఆర్థిక సహాయం
తుపాను కారణంగా ఈ నెల 31 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు 1000కి పైగా విద్యుత్ సిబ్బంది పనిచేస్తున్నారు. 197 గ్రామాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రభుత్వం తుపాను నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్ల క్లియరెన్స్ పై దృష్టి సారించింది.
కాగా.. తుపాను కారణంగా ఈ నెల 31 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. దీంతో వారి జీవనోపాధి అయిన చేపల వేటకు అంతరాయం కలగడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు మంత్రి నారా లోకేష్ రాత్రి నుంచి రాష్ట్ర సచివాలయంలోనే ఉండి తుపాను ప్రభావిత ప్రదేశాల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ.. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆదేశిస్తున్నారు.
READ MORE .....
త్వరగా ప్రాథమిక అంచనాలు ఇవ్వండి: తుపాను నష్టంపై మంత్రి లోకేశ్ ఆదేశాలు






