- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్.. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ
by Naga Rani Yarlagadda |
కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో పార్ట్నర్ షిప్ సమ్మిట్ (Vizag Partnership Summit) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ బృందానికి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ను ఛైర్మన్ గా నియమించింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ లు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. సమ్మిట్ లో వసతులు, ఏర్పాట్లకు సంబంధించి మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
Next Story






