- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో గోదావరి పుష్కరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
by Vemula.Srinu Prasad |
గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది...

X
దిశ, వెబ్ డెస్క్: గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu)పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాల వారీగా స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తోంది. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపైనా మైక్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2015లో జరిగిన పుష్కరాల కంటే 2027 పుష్కరాలను రెట్టింపు స్థాయిలో నిర్వహించాలని, భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకు తగిన స్థాయిలో భద్రత, వసతి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారలతో సచివాలయంలో సిఎస్ విజయానంద్ సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించారు.
Next Story






