- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎస్ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ పొడిగింపు
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ఏపీ సర్కార్ పొడిగించింది. ఆయనపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సీనియర్ అధికారికి పీవీ సునీల్ కుమార్ కు ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఆయన సస్పెన్షన్ ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1969లోని రూల్ 3 (3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్ ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా.. పూర్తయ్యేంతవరకూ ఆయన్ను సర్వీసులోకి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రఘురామపై జరిగిన చిత్రహింసల్లో ఆయన పాత్రపై స్పష్టత వచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియా పోస్టులు, ఇతర వేదిక ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శించారని, ఐపీఎస్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అగ్రిగోల్డ్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ ను మరింత పెంచింది. క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యేంతవరకూ లేదా పదవీ విరమణ వరకూ సస్పెన్షన్ కొనసాగనుంది.






