ఏపీఐఐసీ బోర్డు డైరెక్టర్ల నియామకం.. ఉత్తర్వులు జారీ

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC)కు ఏపీ ప్రభుత్వం బోర్డు డైరెక్టర్లను నియమించింది.

ఏపీఐఐసీ బోర్డు డైరెక్టర్ల నియామకం.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC)కు ఏపీ ప్రభుత్వం బోర్డు డైరెక్టర్లను నియమించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాల నుంచి 15 మంది సభ్యులను బోర్డు డైరెక్టర్లుగా నియమించిన ప్రభుత్వం.. వీరంతా రెండేళ్లు పదవిలో కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత కార్యాచరణ చేపట్టాలని ఏపీఐఐసీ ఎండీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story