Sajjala: లోకేశ్‌వి చవకబారు, చిల్లర వ్యవహారాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-13 14:33:56  IST  )

లోకేష్‌కి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం ఏర్పడి ఉండవచ్చని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు...

Sajjala: లోకేశ్‌వి చవకబారు, చిల్లర వ్యవహారాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోకేష్‌కి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం ఏర్పడి ఉండవచ్చని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఎంతో చవకబారుగా వివేకా అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడని, లోకేష్ ది చిల్లర వ్యవహారమని మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు, పవన్, లోకేశ్ అంతా అతిథి పాత్రల నటులేనని అభివర్ణించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారంపై కూడా సజ్జల వ్యాఖ్యలు చేశారు. అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడే అయినా, టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారని తనకు తానే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు మాటలు పగటి కలలకు ఏమాత్రం తీసిపోవని ఎద్దేవా చేశారు. బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు పాకులాడుతున్నారని, అందుకే ఢిల్లీ వెళుతున్నారని సెటైర్లు వేశారు. జగన్ ఢిల్లీ వెళితే రచ్చ చేసేవాళ్లు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని సజ్జల ప్రశ్నించారు.

ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రపై తమకే అభ్యంతరం లేదని, తాము కూడా ప్రజల్లో తిరగమనే చెబుతున్నామని అన్నారు. కానీ పవన్ ఎంతవరకు తిరుగుతాడన్నది నమ్మకం లేదని, గతంలో తన కుమారుడి కోసం పవన్ యాత్రను చంద్రబాబు ఆపినట్టు తెలుస్తోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజలు ఆమోదించరని సజ్జల స్పష్టం చేశారు.

Next Story