AP: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసులకు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Bala Krishna) తీపి కబురు చెప్పారు.

AP: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసులకు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Bala Krishna) తీపి కబురు చెప్పారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్‌ ఆస్పత్రి (Basavatarakam Indo-American Cancer Hospital)లో ఆంకాలజీ యూనిట్‌ను ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పీడియాట్రిక్‌ వార్డు (Pediatric Ward), పీడియాట్రిక్‌ ఐసీయూ (Pediatric ICU)ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. క్యాన్సర్‌ (Cancer) బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని తుళ్లూరు (Tullur)లో మరో 8 నెలల్లో బసవతారకం క్యాన్సర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతోన్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు.

Next Story