AP: డ్వాక్రా మహిళలకు తీపికబురు.. రుణాల పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం

by Kema Shiva Kumar |

డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న వ్యాపారాల కోసం స్త్రీనిధి రుణాల పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

AP: డ్వాక్రా మహిళలకు తీపికబురు.. రుణాల పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నతరహా వ్యాపారాలు చేయాలనుకునే డ్వాక్రా (DWCRA) మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీపి కబురు చెప్పింది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ‘స్త్రీనిధి’ (Sri Nidhi) ద్వారా అందించే రుణ పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న రుణాలకు అదనంగా మరిన్ని నిధులు కేటాయించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష రుణానికి అదనంగా మరో రూ.2 లక్షల వరకు రుణం అందనుంది. ఇక ఎస్సీ (SC), ఎస్టీ (ST) మహిళలకు ప్రత్యేక రాయితీతో కూడిన రూ.4 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించారు. అయితే, గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా నిర్ణీత గడువులోగా చెల్లిస్తున్న మహిళలకు మాత్రమే ఈ అదనపు రుణాలు మంజూరు చేయనున్నారు. రేపటి నుంచి నెల రోజుల పాటు ‘సెర్ప్’ (SERP) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామ సంఘం నుంచి వ్యాపార ఆసక్తి కలిగిన 15 మంది మహిళలను అధికారులు ఎంపిక చేసి, వారికి రుణ మంజూరు ప్రక్రియలో సాయం అందించనున్నారు.

Next Story