ఏపీకి ప్రపంచ ప్రఖ్యాత టెస్లా కార్ల కంపెనీ.. అమరావతిలో 1000 ఎకరాలు సిద్ధం..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-08 16:52:46  IST  )

ఏపీలో పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ...

ఏపీకి ప్రపంచ ప్రఖ్యాత టెస్లా కార్ల కంపెనీ.. అమరావతిలో 1000 ఎకరాలు సిద్ధం..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలను కూడా రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఎలెన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీని సైతం రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తనకున్న పరిచయాలతో టెస్లా కంపెనీని రాష్ట్రంలో పెట్టించాలనే దిశగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మస్క్ దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలుస్తోంది.

రాష్ట్రంలో టెస్లా కార్ల కంపెనీ పెడితే అమరావతి లేదా నెల్లూరు జిల్లాలో 1000 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు కూడా పంపినట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో గూగుల్ కంపెనీ 143 ఎకరాల భూమి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తు ప్రకార ఉత్తరాన వెంకటేశ్వరుడు ఆలయం, తూర్పున దేవేంద్ర పిరమిడ్, పడమర కొండలు, దక్షిణాన ఖాళీ భూమి ఉన్నాయని, దీన్ని బట్టి గూగుల్ సంస్థకు భూమిని కేటాయిస్తున్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఆయా పరిసరాల్లోనే నిర్మించనున్నట్టు తెలిస్తోంది. అయితే ఈ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story