- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ఏపీ మత్స్యకారులు
ఏపీకి చెందిన 8 మంది మత్స్యకారులు (Fishermen) పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి చెందిన 8 మంది మత్స్యకారులు (Fishermen) పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో బంగ్లాదేశ్ నౌకాదళం (Bangla Desh Navy) వారిని అదుపులోకి తీసుకుంది. బాధితులు విజయనగరం (Vizianagaram) జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ నెల 13న విశాఖలోని రెల్లివీధికి చెందిన సత్యనారాయణకు చెందిన బోటును తీసుకొని సదరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళారు. బుధవారం తెల్లవారుజామున వేట కొనసాగిస్తుండగా పొరపాటున బంగ్లాదేశ్ సాగర జలాల్లోకి వెళ్ళారు. దీంతో అక్కడి నౌకాదళ అధికారులు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దుబాయ్ (Dubai) పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు సత్వరమే స్పందించారు. అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించడమే (Review) కాకుండా వారిని జాగ్రత్తగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను (Officers) ఆదేశించారు.






