- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు పాలనలో ఏపీ రైతులు ప్రశాంతంగా లేరు: మాజీ మంత్రి పేర్ని నాని
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు, రైతులు సంతోషంగా, ప్రశాంతంగా లేరని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు, రైతులు సంతోషంగా, ప్రశాంతంగా లేరని మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ వ్యవసాయ రంగ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయకత్వంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఏ పంటకు సరైన డిమాండ్ లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రపంచ వేదికగా ఏపీ మార్కెటింగ్ జరుగుతుందని టీడీపీ చెప్పుకుంటున్నా, గ్రౌండ్ రియాలిటీ దానికి విరుద్ధంగా ఉందని విమర్శించారు.
చంద్రబాబు కాలు మోపాక రాష్ట్ర వాతావరణమే మారిపోయి, వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన పరిహారం టీడీపీ నేతలకే మళ్లిపోతుందని పేర్ని నాని ఆరోపించారు. గ్రామాలు, పల్లెల్లో కష్టాలు పెరిగిపోయి, ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పెద్ద పెద్ద మాటలు తప్ప, చంద్రబాబు రైతుల కోసం ఏం చేయలేదని, పల్లె మరియు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఘాటుగా వ్యాఖ్యానించారు.






