- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్‌గా విజయానంద్ బాధ్యతల స్వీకరణ
by Naga Rani Yarlagadda |
ఏపీ సీఎస్ గా పదవీ విరమణ చేసిన కె.విజయానంద్.. సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి విరమణ పొందిన కె. విజయానంద్ ను సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా నియమించింది. ఈ క్రమంలో సోమవారం విజయానంద్ సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని మొదటి అంతస్తులో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలుత శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, టీటీడీ వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ కు పలువురు ఉన్నత అధికారులు, సచివాలయ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






