- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి తొలి ర్యాంకు
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఈఏపీసెట్(AP EAPSET) ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంజినీరింగ్(Engineering) విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రి, ఫార్మసీ(Agri and Pharmacy) విభాగంలో 67,761 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/EAPCET ద్వారా తెలుసుకోవచ్చు.
ఇంజనీరింగ్ విభాగంలో..
ఇక ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ విద్యార్థి అనిరుథ్‌రెడ్డి(Telangana Student Anirudh Reddy) మొదటి ర్యాంక్ సాధించారు. హైదరాబాద్ జిల్లా వనస్థలిపురానికి చెందిన విద్యార్థి అనిరుథ్ రెడ్డి.. ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో తొలి ర్యాంక్ దక్కించుకున్నారు. రెండో ర్యాంకు శ్రీకాళహస్తి విద్యార్థి భానుచరణ్ రెడ్డి సాధించారు. మూడో ర్యాంకు పాలకొల్లుకు చెందిన విద్యార్థి యశ్వంత్, నాలుగో ర్యాంకు నంద్యాల జిల్లా విద్యార్థి రామ్ చరణ్ రెడ్డి, అనంతరం విద్యార్థి నితిన్ ఐదో ర్యాంకు సాధించారు.
అగ్రి, ఫార్మసీ విభాగంలో ...
పెనమలూరు విద్యార్థి సాయి హర్షవర్ధన్ అగ్రి, ఫార్మసీ విభాగంలో తొలి ర్యాంకు సాధించారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన నిశాంత్ రెండో ర్యాంకు, కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్థి వినయ్ మల్లేశ్‌కు మూడో ర్యాంకు, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన విద్యార్థి షణ్ముఖ్ నాలుగో ర్యాంకు, కాకినాడ విద్యార్థి సాయి గోవర్థన్ ఐదో ర్యాంకు సాధించారు.






