ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడుపు పెంపు.. లేట్ ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-02 13:19:45  IST  )

ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడువును మరింత పొడిగించారు. ఈ మేరకు కన్వీనర్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు.

ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడుపు పెంపు.. లేట్ ఫీజుల చెల్లింపులపై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET Application) దరఖాస్తులకు గడువును మరింత పెంచుతున్నట్లు కన్వీనర్ ఎన్. మోహన్ రావు వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ఈ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 17 వరకూ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. పెంచిన గడువుకు ఎలాంటి లేట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 17వ తేదీ తర్వాత మార్చి 21 లోగా దరఖాస్తు చేసుకునేవారు లేట్ ఫీజు రూ.1000, మార్చి 25 వరకూ రూ.2000, మార్చి 30 వరకూ రూ.4000, ఏప్రిల్ 3 వరకూ రూ.10,000 లేట్ ఫీజులు చెల్లించి దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తుల్లో తప్పులను సరిచేసేందుకు ఏప్రిల్ 4-6 వరకూ అవకాశం ఇచ్చారు. ఇక ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ తేదీలు, సమయాల్లో ఎలాంటి మార్పులుండవని తెలిపారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టులు మే 12 నుంచి 15వ తేదీ వరకూ, 18వ తేదీన నిర్వహిస్తారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్టులు మే 19,20 తేదీల్లో జరగనున్నాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక కీ ని మే 23న విడుదల చేసి.. కంప్లైంట్లను 25 వరకూ స్వీకరించనున్నారు. ఈఏపీసెట్ ఫైనల్ రిజల్ట్స్ జూన్ 1న ప్రకటించనున్నారు.

Next Story