- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP DSc : ఏపీ డీఎస్సీకి లైన్ క్లియర్
ఏపీ డీఎస్సీ(AP DSc) పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డీఎస్సీ(AP DSc) పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.ఆర్. గవాయ్(Justice BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ దశలో వాయిదా వేయడం వల్ల లక్షలాది అభ్యర్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. యథావిధిగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేస్తూ.. అభ్యర్థుల సమస్యలు స్థానికమైనవి కాబట్టి వాటిని హైకోర్టులో పరిష్కరించుకోవచ్చని సూచించింది. పరీక్షల ప్రిపరేషన్ కు తగిన సమయం లేదని, సిలబస్‌లో మార్పులు, పరీక్షా కేంద్రాలలో సమస్యలు ఉన్నాయని పిటిషన్ దాఖలవగా.. ఉన్నత న్యాయస్థానం దానిని కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15న 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి సంబంధించిన పరీక్షలు మే 25 నుంచి జూన్ 5, 2025 వరకు జరగనున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తీర్పును స్వాగతిస్తూ..ఇప్పటికే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. 1,200 కేంద్రాల్లో 4.5 లక్షల మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని తెలిపారు. అయితే కొందరు అభ్యర్థులు సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.






