- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఏపీలో ఉగ్రదాడి టెన్షన్... డీజీపీ కీలక ప్రకటన
ఉగ్రదాడి టెన్షన్ నేపథ్యంలో ఏపీ డీజీపీ కీలక ప్రకటన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: పహల్గాం దాడి(Pahalgam attack)లో 26 మంది భారతీయులు(Indians) చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఏపీ(Ap)కి చెందిన వారు కూడా ఉన్నారు. దీంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఎవరైతే ఇతరులు ఉంటున్నారో వారందరిని గుర్తించి స్వదేశాలకు పంపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) ఇతర దేశస్తులు ఉన్నారని, వారందరిని వాళ్ల స్వస్థలాలకు పంపాలని కేంద్రప్రభుత్వం(Central Goverernment) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇతర దేశాలకు చెందిన వారి లిస్టును రెడీ చేస్తోంది.
ఈ నేపథ్యంలో పలు రకాల దుష్ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో హై అలర్ట్(High alert) ప్రకటించినట్లు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అలర్జ్ జోన్స్‌గా ప్రకటించినట్టు తప్పుడు ప్రచారం కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, ప్రభుత్వాలు ఏపీకి ఎలాంటి అలెర్ట్‌లు జారీ చేయలేదని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఫేక్ ప్రచారాలు చేయొద్దని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వదంతుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి జారీలు చేయలేదని హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.






