ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన.. లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పణ

by Naga Rani Yarlagadda |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో పర్యటించారు.

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన.. లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో పర్యటించారు. ఉదయం రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. తమ గ్రామానికి రోడ్డు కావాలని అడగడంతో.. పవన్ సానుకూలంగా స్పందించారు. అక్కడి నుంచి ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు.

పవన్ కల్యాణ్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న పవన్.. పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆవిష్కరించారు. అలాగే సుందరగిరిపై వెళ్లే రోడ్డు, ఆలయ ప్రదక్షిణ నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు.

Next Story