- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. భద్రత కట్టుదిట్టం
by Naga Rani Yarlagadda |
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురానికి చేరుకుంటారు. అక్కడ కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు, ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక తిరిగి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పవన్ కల్యాణ్ పర్యటననేపథ్యంలో ద్వారకా తిరుమల మండలంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story






