రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-12 07:18:13  IST  )

వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు...

రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) తెలిపారు. వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah)గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రామయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందించారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలిపారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘‘పర్యావరణ పరిరక్షణ(Environmental protection) కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేసిన పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య. సుమారు కోటి మొక్కలు నాటారు. ఆయన కన్నుమూశారని తెలిసి చింతించా. వృక్షో రక్షతి రక్షిత: అనే పెద్దల మాటలోని వారసత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రామయ్య పడిన తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు జల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వనయజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుంది. రామయ్యకు ఓ సందర్భంలో ప్రమాదం చోటు చేసుకుంటే ఆస్పత్రిలో ఉండగా పరామర్శించా. అప్పుడు కూడా పర్యవరణ పరిరక్షణపైనే మాట్లాడారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ పచ్చదనం పెంపునకు కృషి చేస్తాం. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాం.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Next Story