- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తోనే అభివృద్ధి సాధ్యం: పవన్ కళ్యాణ్
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తోనే అభివృద్ధి సాధ్యం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌తోనే అభివృద్ధి సాధ్యం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏడాది పొడవునా ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరిగితే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. ఎన్నికల కారణంగానే కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ జరుగుతుందని తెలిసినా అక్కడకు వెళ్లలేకపోయానని చెప్పారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై చాలా ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఎన్నికలప్పుడు EVMలపై మాట్లాడినట్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై మాట్లాడుతున్నారని అన్నారు. గెలిస్తే EVMలు సూపర్, ఓడితే EVMలు ట్యాంపరింగ్ అంటున్నారని ఎద్దేశా చేశారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి కొత్తకాదని 1952-67 వరకు ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని చెప్పారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. తమిళనాడు తన జీవితంపై చాలా ప్రభావం చూపించిందని అన్నారు. ఇక్కడే సినిమా, రాజకీయ, ఆధ్యాత్మిక భావనలు కలిగాయని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడే నేర్చుకున్నానని అన్నారు. అందుకే తమిళనాడు అంటే ప్రత్యేక గౌరవం అని చెప్పారు.






