- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమస్యలపై పవన్ ఫోకస్.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి
ఢిల్లీలో కేంద్రమంత్రిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు..

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురంలోని సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఈ మేరకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్రమంత్రి మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్(Union Railway Minister Ashwini శ్రీవైష్ణవని కలిశారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి కెళ్లారు. సేతు బంధన్ పథకం(Setu Bandhan Scheme) కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఆధ్యాత్మికంగా పిఠాపురం
పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్‌ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద వల్లభ స్వామి కొలువైన విఖ్యాత క్షేత్రాలు పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. ఇందుకు అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఆయనకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.






