సీపీ సజ్జనార్ ను అభినందించిన ఏపీ డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

సినిమా పైరసీ ముఠాను (Piracy Gang) అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులను, సీపీ సజ్జనార్ (CP Sajjanar) ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందించారు.

సీపీ సజ్జనార్ ను అభినందించిన ఏపీ డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా పైరసీ ముఠాను (Piracy Gang) అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులను, సీపీ సజ్జనార్ (CP Sajjanar) ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందించారు. సినిమా విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు.

పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ (Ibomma), బప్పమ్ (Bappam) వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సీపీ సజ్జనార్ తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని అన్నారు.

Next Story