- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ACA కీలక నిర్ణయం
అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్(AP Cricket Association) నిర్ణయించింది. ఎంపీ కేశినేని చిన్ని(MP Keshineni Chinni) ఆధ్వర్యంలో జరిగిన విజయవాడ నోవాటెల్ హోటల్(Vijayawada Novotel Hotel)లో ఏసీఏ వార్షిక సర్వసభ్య(ACA Annual General Meeting) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో మహిళల వరల్డ్ కప్ నిర్వహిస్తున్నామని.. ఈ మేరకు 5 మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభించిందని చెప్పారు. రెండేళ్లలో 25 జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తామన్నారు.
కర్నూలు, నెల్లూరులో ప్రభుత్వ స్థలం ఉందని, అక్కడ కూడా స్టేడియాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని కేశినేని చిన్ని చెప్పారు. అన్ని జిల్లాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తామన్నారు. అమరావతిలో అతి పెద్ద స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, ఏసీఏకు స్థలం వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ స్టేడియం కోసం మొత్తం 65 ఎకరాలు కోరుతున్నామని తెలిపారు. లక్షమంది సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించే యోచన చేస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.






