AP కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు రేపటికి వాయిదా.. అసలు కారణం ఇదే

by Kema Shiva Kumar |

అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు ఇవాళ సచివాలయంలో ఉదయం 11 గంటలకు హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేయాల్సి ఉంది.

AP కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు రేపటికి వాయిదా.. అసలు కారణం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు ఇవాళ సచివాలయంలో ఉదయం 11 గంటలకు హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేయాల్సి ఉంది. అయితే, తుది జాబితాను బోర్డు మరోసారి పరిశీలించనున్న నేపథ్యంలో ఫలితాల విడుదలను రేపటికి వాయిదా వేశారు. రేపు సరిగ్గా ఉదయం 11 గంటలకు సచివాలయంలోనే హోంమంత్రి ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు. కాగా, కానిస్టేబుల్ పరీక్షను 2022 అక్టోబర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాల కారణంగా తుది రిజల్ట్స్ అనౌన్స్ చేయలేకపోయారు. ఇప్పటికే రెండు వారాల క్రితం అభ్యర్థులకు ర్యాంక్ కార్డులను కూడా విడుదల చేసిన విషయం విదితమే.

Next Story