Megastar Chiranjeevi కాంగ్రెస్‌లోనే ఉన్నాడు.. AP పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
Megastar Chiranjeevi కాంగ్రెస్‌లోనే ఉన్నాడు.. AP పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రుద్రరాజు చిరంజీవి రాజకీయ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని.. అక్రమాలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రజా వ్యతిరేక పాలనపై జనం విసిగిపోయారన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని.. ఆయనకు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. అంతేకాదు.. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీ ఉంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టారని చెప్పుకొచ్చారు.

ఈ విషయం మీతో పంచుకోవడానికి ఆగలేకపోతున్నా: Tamannaah

Next Story

Most Viewed