Ap News: కాపులు, బీసీలకు సీఎం పదవి.. ఏపీ కాంగ్రెస్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 16 |
Ap News: కాపులు, బీసీలకు సీఎం పదవి.. ఏపీ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిల్ తప్ప సాధించినవి ఏమీ లేవని ఆయన విమర్శించారు. ఏపీలో అభివృద్ధి లేదని, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20-30 సీట్లకు మించి రావంటూ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్, చంద్రబాబును ఎస్సీ, ఎస్‌టీ మైనారిటీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు టీడీపీ, వైసీపీలకు పాతరేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశమంతా కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు కాపులకు, మరో రెండున్నరేళ్లు ఓబీసీలకు అధికారం ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో తాను మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే అధికారం లభించిందని చెప్పారు. బీజేపీ సహకారం లేకపోతే ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిలబడదని తెలిపారు. ఏపీలో పేదల ఆకాంక్షలు నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీనేనని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ స్పష్టం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed