AP News : ఏపీ కాంగ్రెస్ నేత దారుణ హత్య

by Muthe.Rajitha |   (  Updated:2025-04-27 12:13:10  IST  )

ఏపీ(AP)కి చెందిన కాంగ్రెస్ కీలక నేత దారుణ హత్య(Congress Leader Murdered)కు గురయ్యాడు.

AP News : ఏపీ కాంగ్రెస్ నేత దారుణ హత్య
X

దిశ వెబ్ డెస్క్ : ఏపీ(AP)కి చెందిన కాంగ్రెస్ కీలక నేత దారుణ హత్య(Congress Leader Murdered)కు గురయ్యాడు. మృతుడు ఆలూరు కాంగ్రెస్ ఇంచార్జీ లక్ష్మీ నారాయణగా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం(Anantapuram) జిల్లా గుంతకల్లు రైల్వే వంతెన వద్ద నుంచి తన కుమారుడు వినోద్ తో ఇన్నోవా కారులో వెళ్తున్న లక్ష్మీ నారాయణపై దుండగులు ఎటాక్ చేశారు. తొలుత లారితో గుద్ది, అనంతరం వేట కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

అయితే జరిగిన దారుణంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తండ్రీ కొడుకులను ఆసుపత్రికి తరలించగా.. లక్ష్మీ నారాయణ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వినోద్ ప్రాణాపాయ స్థితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితులను త్వరలోనే పట్టకుంటామని పేర్కొన్నారు.

Next Story