AP | నేడు సచివాలయంలో సీఎం సమీక్ష

by Thanuru Gopichand |

నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అధ్యక్షతన సమీక్ష సమావేశం జరగనుంది.

AP | నేడు సచివాలయంలో సీఎం సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అధ్యక్షతన సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు వైద్య ఆరోగ్య శాఖపై.. మధ్యాహ్నం 12.30కి గృహ నిర్మాణ శాఖపై, మధ్యాహ్నం 2.30కి వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష (Review) చేయనున్నారు. శాఖల పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, చేపట్టవలసిన కార్యక్రమాలు, పనులు ఏయే దశల్లో ఉన్నాయనే వాటిపై సీఎం సమీక్షించనున్నారు. అదే విధంగా ఆయా శాఖల మంత్రులు, అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు. నవంబరు 24 నుంచి 29 వరకు వ్యవసాయంలో పంచసూత్రాలపై ఏడు రోజులపాటు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సమీక్షా సమావేశంపై ఆసక్తి నెలకొంది.

Next Story