అసత్యాలతో సీఎం జగన్.. అగమ్యగోచరంగా విద్యార్థుల పరిస్థితి ..

by Disha Web Desk 3 |
అసత్యాలతో సీఎం జగన్.. అగమ్యగోచరంగా విద్యార్థుల పరిస్థితి ..
X

దిశ వెబ్ డెస్క్: గతంలో జగన్ మామయ్యా వస్తున్నాడు.. మీ బ్రతుకులో వెలుగు తెస్తున్నాడు అని వేదికల పైన ఉపన్యాసాలు అదరగొట్టారు సీఎం జగన్. అయితే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటె అంతమందిని చదివిస్తాను అని చెప్పిన జగన్.. అనతికాలం లోనే మాట తప్పి అసత్యాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇది ప్రస్తుతం విద్యార్థులు అంటున్న మాట. జగన్ మావయ్య.. కళాశాలల ఫీజులు చెల్లించవేమయ్య అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు, జనవరి మొదటి వారంతో సెమిస్టర్‌ పరీక్షలు కూడా ముగిశాయి. ముగిసిన సెమిస్టర్‌ పరీక్షలతో సగం విద్య సంవత్సరం పూర్తయింది.

కానీ విద్యార్థుల తరుపున కళాశాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులు మాత్రం చెల్లించలేదు. అంతే కాదు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన ఒక్క త్రైమాసికం ఫీజు కూడా విడుదల చెయ్యలేదు ప్రభుత్వం. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు విడుదల చేస్తున్నామంటూ అసత్యాలను అలవోకగా చెప్పేస్తున్నారు. ఇక బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఏప్రిల్‌ 29తో విద్యా సంవత్సరం ముగిసిపోతున్న నేపథ్యంలో ఇక వీరికి కేవలం మూడున్నర నెలల వ్యవధి మాత్రమే ఉంది.

కానీ ప్రభుత్వం మూడు త్రైమాసికాల ఫీజులు విడుదల చేయాల్సి ఉంది. ఈ సంవత్సరం చెల్లించాల్సిన ఫీజు ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు చేరలేదు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మందికిపైగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నిమ్మలంగా ఉంది. మరో వైపు కళాశాలల యాజమాన్యాలు ఫీజులు కడితే పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ అయిన.. సర్టిఫికెట్లు అయిన అని విద్యార్థులను దబాయిస్తున్నారు. రేపు చెల్లిస్తాం, మాపు చెల్లిస్తాం అంటూ జగన్ బుకాయింపులతో కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్తోమత లేకపోయినా తల్లిదండ్రులు బకాయలు చేసి కళాశాల ఫీజు చెల్లించిన అప్పులు పాలవుతున్నారు.

Next Story

Most Viewed