- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖకు సీఎం చంద్రబాబు.. మరో ప్రతిష్టాత్మక క్యాంపస్‌కు భూమి పూజ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 12న విశాఖ వెళ్లనున్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఈ నెల 12న విశాఖ(Visakha) వెళ్లనున్నారు. కాగ్నిజెంట్ క్యాంపస్(Cognizant Campus)కు భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖ(Visakha)ను ఆర్థిక రాజధాని(Capital)గా తీర్చిదిద్దుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు పలు కంపెనీలను పెట్టుబడులు పెట్టాలని కోరింది. దీంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు విశాఖకు వచ్చాయి. మరికొన్ని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు తొలి అడుగుపడుతోంది. ఈ నెల 12న ఈ క్యాంప్‌కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అంకురార్పణ జరగనుంది. అనంతరం విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు.
Next Story






