Ap News: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో సమావేశం..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-10 14:21:06  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు...

Ap News: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో సమావేశం..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బనకచర్ల(Banakacharla)తో పాటు తెలంగాణ(Telangana) చేస్తున్న ఇతర అభ్యంతరాలపై ఆయన ప్రధాని మోడీ(Pm Modi)తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న హస్తినకు వెళ్తున్నట్లు సమాచారం. బనకచర్లపై తమ ప్రతిపాదనలను కూడా ప్రధాని మోడీ ఎదుట ఉంచనున్నారు. అలాగే రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. మోడీ అపాయింట్ మెంట్ నేపథ్యంలో రెండు, మూడు రోజులు అక్కడే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగు కేంద్రమంత్రులతోనూ ఆయన భేటీ అవుతారని అధికార యంత్రాంగం చెబుతోంది.

కాగా రాయలసీమ(Rayalaseema)కు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో గోదావరి నది(Godavari River)పై రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతున్న విషయం తెలిసిందే. సముద్రంలో వృధాగా పోయే నీళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలపై ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం వివరణ కోరిన నేపథ్యంలో చంద్రబాబు టూర్ ఆసక్తికరంగా మారింది.

Next Story