ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరుగురు కేంద్రమంత్రులతో వరుసగా భేటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-18 11:05:11  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు..

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరుగురు కేంద్రమంత్రులతో వరుసగా భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై శుక్రవారం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ మేరకు 6 గంటలకు అమరావతి(Amaravati) నుంచి ఢిల్లీ(Delhi) బయలుదేరి వెళ్లనున్నారు. ఆరుగురు కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా శుక్రవారం భేటీ కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా‌తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ని సీఎం చంద్రబాబు కలుస్తారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. తిరిగి శుక్రవారం రాత్రి అమరావతి చేరుకోనున్నారు. శనివారం అనకాపల్లి పర్యటనకు వెళ్తారు. ఆ జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Next Story