'రైసినా డైలాగ్ - 2026'లో ప్రసంగం... ఢిల్లీకి సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రగతి మైదాన్‌ భారత్ మండపంలో మార్చి 5 నుంచి 7 వరకు జరనున్న 'రైసినా డైలాగ్ - 2026' 11వ ఎడిషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ..

రైసినా డైలాగ్ - 2026లో ప్రసంగం... ఢిల్లీకి సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) శనివారం ఢిల్లీ (Delhi)వెళ్లనున్నారు. ప్రగతి మైదాన్‌ భారత్ మండపం(Pragati Maidan Bharat Mandapam)లో మార్చి 5 నుంచి 7 వరకు జరనున్న 'రైసినా డైలాగ్ - 2026' (Raisina Dialogue-2026) 11వ ఎడిషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 11:00 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం తర్వాత భారత్ మండపం వేదికగా జరిగే సదస్సులో సీఎం పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి వచ్చిన దౌత్యవేత్తలు, మేధావులు, రాజకీయ ప్రతినిధులతో కలిసి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. గతంలోనే ఏఐ (AI) విషయంలో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు.. ఈ అంతర్జాతీయ వేదికపై ఏపీలో అమలు చేస్తున్న సాంకేతిక సంస్కరణలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించే అవకాశం ఉందని టీడీపీ ఎంపీలు అంటున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి రాత్రి 7:00 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Next Story