హైదరాబాద్‌ ఒక్క తెలంగాణది కాదు: ఏపీ సీఎం చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-25 10:39:14  IST  )

హైదరాబాద్ ఒక్క తెలంగాణది కాదని, తెలుగు ప్రజలందరిదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

హైదరాబాద్‌ ఒక్క తెలంగాణది కాదు: ఏపీ సీఎం చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) ఒక్క తెలంగాణ(Telangana)ది మాత్రమే కాదని, తెలుగు ప్రజలందరిదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) అన్నారు. దావోస్(Davos) పర్యటనపై అమరావతి(Amaravati) సచివాలయంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిదని, ఏ ఒక్కరిదో అనుకుంటే పొరపాటేనని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి తాను గర్వపడుతున్నట్లు తెలిపారు. తన హయాంలో హైదరాబాద్‌లో సంపద సృష్టించామని చెప్పారు. అలా సృష్టించిన సంపదను ధ్వంసం చేయాలని ఎవరూ అనుకోరని,. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్(Kadap Steel Plant) కూడా ముఖ్యమేనని, ప్రస్తుతం జిందాల్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story